Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్యార్థి నిరుద్యోగ ఫ్రంట్ చైర్మెన్ చనగాని దయాకర్
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతిలోగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేకుంటే ఉద్యోగాల భర్తీకి ఇక కోట్లాటే అని విద్యార్థి నిరుద్యోగ ఫ్రంట్ చైర్మెన్ చనగాని దయాకర్ అన్నారు. విద్యార్థి నిరుద్యోగ మహా నిరసన, ర్యాలీ, విద్యార్థుల నినాదాలతో గురువారం ఓయూ దద్దరిల్లింది. ఏడేండ్ల పాలనలో మూడు ఉప ఎన్నికలు, కమిషన్లు, కలెక్షన్లు అంటూ సాగిందని, తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం కోసం రాళ్లు కొట్టిన విద్యార్థులు నేడు నిరుద్యోగ కూలీలుగా మారారు అని చనగాని దయాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్ కాలంలో 50 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు అని, ఉద్యోగుల ప్రకటనకు ఇంకా ఎంతమంది విద్యార్థులు బలి కావాలి అని మండిపడ్డారు. సంక్రాంతిలోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేకపోతే ఇక నిత్యం కొలువుల కోసం విధివీధిన కోట్లాటే అని హెచ్చరించారు. నిరసన ర్యాలీలో నిరుద్యోగ నాయకులు మెడ శ్రీను, యాకయ్య, సతీష్ యాదవ్, చంద్రశేఖర్, రాకేష్, వెంకన్న, రాజు పాల్గొన్నారు.