Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గురువారం హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని హైదర్‌నగర్, రాంనరేష్‌నగర్ కాలనీలలో రూ.42 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్‌రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. పనుల్లో జాప్యం వహించకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం భాగ్యనగర్ ఫేజ్ 2, హెచ్ఎంటీ శాతవాహన, జల వాయు విహార్ కాలనీలో ప్రజా సమస్యలపై వారు పాదయాత్ర చేశారు. కార్యక్రమంలో ఈఈ గోవర్ధన్, ఏఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, నాయకులు దామోదర్‌రెడ్డి, పోతుల రాజేందర్, రాగ ప్రసాద్, వీరపనేని శ్రీనివాస్, వెంకటేష్ యాదవ్, సత్యనారాయణ, అర్జున్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, సుధాకర్, శ్రీహరి, అష్రఫ్, ఖదీర్, సిద్దం, శ్రీకాంత్, సదా బాలయ్య, చాట్ల రవి, కుమార స్వామి, రాజు సాగర్, సద్దాం, సత్తార్, యాసిన్, పప్పు, ముజ్జు, విమల, స్వప్న, మాధవి, బీజాన్ బీ, దుర్గ, రాంనరేష్ కాలనీ అధ్యక్షులు నక్కా శ్రీనివాస్, సుధాకర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, కిషన్‌రావు, మాధవరెడ్డి, రాంచందర్, లక్ష్మణ్, హెచ్ఎంటీ శాతవాహన కాలనీ రామ్ కోటేశ్వరరావు, యాదిరెడ్డి, మదన్ మోహన్, హనుమంతరాజు, కృష్ణారావు, సీతారాముడు, జల వాయు విహార్ గౌరిపతి, సుబ్బయ్య, ప్రసాద్, భాషా, భాగ్యనగర్ ఫేస్ 2 చౌదరి, అనిల్, కృష్ణమూర్తి, రామకృష్ణ, జోగి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.