Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కీసర మండలంలోని గోధుమకుంట, రాంపల్లి దాయార, కరీంగూడ గ్రామాల అభివృద్ధికి ఎంపీ నిధులు కేటాయించాలని కోరుతూ ఎంపీటీసీ మంచాల కిరణ్ జ్యోతి ప్రవీణ్ కుమార్ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. తాను మూడు గ్రామాలకు ఎంపీటీసీగా ఉన్నాననీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి నిధులు కూడా మంజూరు చేయడం కావడం లేదన్నారు. నిధుల్లేక గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నాయన్నారు. ఎంపీ కోటా కింద నిధులు మంజూరి చేసి ఆదుకోవాలని కోరారు.