Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
చిలకానగర్ డివిజన్లోని శ్మశానవాటికల అభివృ ద్ధికి నిధులు మంజూరు చేయాలని చిల్కానగర్ కార్పొ రేటర్ బన్నాల గీత ప్రవీణ్ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజకి వినతిపత్రం అందజేశారు. ఇటీవల డివిజన్‌కు చెందిన వివిధ కులాల వారు వారి శ్మశానవాటికలను అభివృద్ధి చేయాలని తనకు వినతిపత్రాలు అందజేశా రనీ, వారి వినతిని పరిగణలోకి తీసుకుని డివిజన్లోని అన్ని శ్మశాన వాటికలకు మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించాలని కోరారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్ర మంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, అశోక్ రెడ్డి, నాగేందర్ పాల్గొన్నారు.