Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, పరిష్కారం కోసం వార్డులోని అన్ని బస్తీలు, కాలనీల్లో పర్యటించనున్నట్టు మాజీ ఉపాధ్యక్షుడు, బీజేపీ నాయకులు జంపన ప్రతాప్ పేర్కొన్నారు. బస్తీల్లో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకు దశల వారీగా పరిష్కరించనున్నట్టు తెలిపారు. శుక్రవారం బోయిన్పల్ల్లి కడక్ పురాలో పర్యటించారు. భూగర్భ డ్రయినేజీ సమస్య ఉందనీ, తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదనీ, వీధి దీపాలు వెలగడం లేదనీ, పవర్ బోర్ వెల్ నీరు కూడా సరఫరా చేయడం లేదనీ, బస్తీలో రోడ్లు గుంతలమయంగా మారాయని స్థానికులు తనకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దశాబ్దాల క్రితం వేసిన డ్రయినేజీ వ్యవస్థ వల్ల మురుగునీరు రోడ్ల పైకి చేరుతుందన్నారు. నూతన డ్రయినేజీ లైన్ వేసి అనంతరం రోడ్డు పనులు చేస్తామని హామీచ్చారు. సమస్యలను బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షకీబ్, అజాం, ఆతెర్, మౌల, షౌకత్, పేరుకే మహేందర్, పాల్గొన్నారు. కృష్ణారెడ్డి కాలనీ అధ్యక్షుడు మొహియుద్దీన్ జంపనను కలిసి కాలనీలో సూచిక బోర్డ్డులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పది రోజుల్లో కాలనీల్లో ఏర్పాటు చేస్తామని జంపన హామీనిచ్చారు.