Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్ పేట
తుంకుంట మున్సిపాలిటీ ప్రజలందరికీ మున్సిపల్ చైర్మెన్ కారంగుల రాజేశ్వర్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కోటి ఆశలతో కొంగొత్త ఊసు లతో రేకెత్తించిన ఉత్తేజంతో అడుగిడుతున్న ఈ సరికొత్త నూతన ఏడాదిలో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు విరజిమ్మాలనీ, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిం చాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కరోనా కష్టాలు కడతేరి కొత్త సంవత్సరం ప్రజలకు సరికొత్త ఉత్సాహాన్ని నింపాలని అకాక్షిం చారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ఎన్నో అద్భుత విజ యాలు సాధించిందనీ, రాబోయే కొత్త సంవత్సరంలో కూడా మరెన్నో విజ యాలు సాధించి దేశంలో తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలవాలని ఆకాంక్షిం చారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలనీ, మాస్క్ తప్పక ధరించాలని సూచించారు.