Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన అవసరం ఉందని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా కీసర మండలం నర్సంపల్లి గ్రామ ఉప సర్పంచ్ స్వప్న శ్రీనివాస్ రెడ్డి, నాగారం మున్సిపాలిటీ, రాంపల్లి గ్రామం నుంచి టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, మల్కాజిగిరి పార ్లమెంట్ ఇన్చార్జి మల్లు రవి, మేడ్చల్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ తోటకూర వజ్రేష్ యాదవ్, సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ ,రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పటిస్తూ రైతులు, నిరుద్యోగు లను మోసం చేస్తున్న పార్టీలకు చరమగీతం పాడేందుకు యువత కాంగ్రెస్ వైపు చూస్తుందన్నారు. భూమయ్యయాదవ్, రాజుగౌడ్, జి.ప్రశాంత్‌గౌడ్, నరేందర్, సత్యనారాయణ, అశోక్, కుమార్, శివ, సోమిరెడ్డి, రాజు, కర్ణాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కకర్, వెంకటేష్, శ్రీనివాస్ శ్రీశైలం, నవీన్, కుమార్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త సుశాంత్గౌడ్, నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్‌రెడ్డి, నాగారం మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి నల్లోల కుమార్, నాగారం మున్సిపాలిటీ కౌన్సిలర్ పంబల్ల సరితా రమేష్, మహిపాల్ రెడ్డి, సోంరెడ్డి, విగేష్, పొట్ట శ్రీశైలం, ఓం సాయి గౌడ్, బాలరాజ్ యాదవ్, నాగారం మున్సిపల్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పంగ సంతోష్, కీసర మండల అధ్యక్షుడు కొల్ల క్రిష్ణ యాదవ్, గోధుమ కుంట ఎంపీటీసీ మంచాల కిరణ్ జ్యోతి ప్రవీణ్, మధుసూదన్ రెడ్డి, రామిడి విజయారెడ్డి, ప్రదీప్ కుమార్, సాదీక్ ఆలీ, హరిబాబు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.