Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
సమాజంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు స్పందన చైల్డ్ లైన్ 1098 స్వఛ్ఛంద సంస్థ పని చేస్తుందని కో-ఆర్డినేటర్ రమాదేవి అన్నారు. శుక్రవారం బాలాపూర్ మండలంలోని కొత్తపేట ప్రభుత్వ పాఠశాలలో మండల సలహా బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రమాదేవి, ఉదయరాణి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బాలాపూర్ ఇన్స్పెక్టర్ భాస్కర్ మాట్లాడుతు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలన చేయటంతో పాటు బాల్య వివాహాల నియంత్రణ కోసం ఎంతో కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీయూ పాఠశాల ప్రదానోపాధ్యాయులు అమరనాథ్ రెడ్డి, అంగన్ వాడీ, ఏఎన్ఎం సమాఖ్య లీడర్లు, స్పందన చైల్డ్ లైన్ కో-ఆర్డినేటర్ నరేష్, శ్వేత, అనుష, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.