Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్ గుల్ గ్రామంలో ఉన్న మాత దేవోభవ అనాథ అశ్రమంలో శుక్రవారం రంగారెడ్డి జిల్లా వికలాంగుల వయోవద్దుల సంక్షేమ శాఖ అధికారి ఎన్.మోతీ ఆధ్వర్యంలో అభాగ్యుల మధ్యన నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని అనాథలకు దుప్పట్లు, అరటిపండ్లను పంపిణీ చేశారు. ఇంతమంది అనాథలకు మానవతా హదయంతో సేవా కార్యక్రమలను అందిస్తున్న ఆశ్రమ వ్యవస్థాపకుడు గట్టు గిరి సంకల్పం గొప్పదని కొనియాడారు. ఆశ్రమానికి తమవంతు సహాయ సహఆరం ఎల్లప్పుడూ ఉంటుదని అన్నారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ సరస్వతి, శ్రావంతి, ఎఫ్ఆర్వో లు హనుమంతు, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.