Authorization
Sat March 22, 2025 10:45:18 pm
నవతెలంగాణ-హయత్నగర్
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) 51వ ఆవిర్భావ దినోత్సవాన్ని హయత్నగర్లో అబ్దుల్లాపూర్మెట్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బి.శంకర్ హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎస్ఎఫ్ఐ ఆవిర్భావం నుంచి నేటి వరకు అధ్యయనం పోరాటం, చదువుతూ పోరాడు.. చదువుకై పోరాడు నినాదంతో ముందుకెళ్తోందని, విద్యార్థుల, విద్యారంగం సమస్యలపై పోరాడుతోందని తెలిపారు. స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం లక్ష్యాలుగా ఎస్ఎఫ్ఐ పనిచేస్తోందన్నారు. కేంద్రం తీసుకొస్తున్న నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అబ్దుల్లాపూర్మెట్ మండల కార్యదర్శి గుండు శివ కుమార్, సభ్యులు వంశీ, నితిన్, అక్షర, భార్గవి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.