Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కషి చేస్తుందని ది భాగ్యనగర్ రైతు సేవా సహకార సంఘం ఛైర్మెన్న మర్రి నర్సింహ్మ రెడ్డి అన్నారు. శుక్రవారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్ గుల్ గ్రామంలోని ది భాగ్యనగర్ రైతు సేవా సహకార సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను వైస్ చైర్మెన్ బంగారు బాబుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్య ఇస్తుందని తెలిపారు. ముఖ్యంగా రైతులకు వ్యవసాయ రంగంపై అవగాహన కల్పించడంతో పాటు రైతులకు రైతు బంధు పథకం ద్వార పంటల పెట్టుబడి కోసం నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులను అందచేసి ఆదుకోవటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ చైర్మెన్ పెత్తుల పుల్లా రెడ్డి, డైరెక్టర్లు యెల్చల సుదర్శన్ రెడ్డి, తిరుపతి గిరిరాజ్, శ్రీరామ్ రెడ్డి, బ్యాంక్ మేనేజర్ పిండి నారాయణ్ రెడ్డి, అసిస్స్టెంట్ మేనేజర్ సువర్ణ, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.