Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ఎన్టీపీసీ జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మహారాష్ట్రకు చెందిన మిహిర్ నితిన్ అపర్ కంచు పతకం దక్కించుకున్నాడు. గచ్చిబౌలి మైదానంలో జరిగిన సబ్ జూనియర్ కాంపౌండ్ బాలుర విభాగంలో మూడో స్థానంలో నిలిచి ఈ పతకం సాధించాడు. గత ఆగస్టులో పోలాండ్‌లో జరిగిన ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లోనూ అతడు బంగారు పతకం గెల్చుకున్నాడు. ఈ సందర్భంగా మిహిర్ నితిన్ అపర్‌ను ఇండియన్ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ సారంగపాణి అభినందించారు. మిహిర్‌తో పాటు అతడి తండ్రిని సాదరంగా సత్కరించారు. కార్యక్రమంలో సారంగపాణి కుటుంబ సభ్యులతో పాటు సీనియర్ కార్టూనిస్ట్ నారూ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.