Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మౌలిక సదుపాయాల కల్పనకు తగిన కషి చేస్తున్నట్లు కార్పొరేటర్ శ్రావణ్ అన్నారు. గురువారం మల్కాజిగిరి డివిజన్ ఆనంద్ బాగ్‌లోని శ్రీధర్ ఎంక్లేవ్‌లో స్థానిక కాలనీ వాసులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా డ్రయినేజీ, పైపులైను, స్ట్రీట్ లైట్స్, ఓపెన్ ల్యాండ్స్‌లో పబ్లిక్ చెత్తను వేయడం తదితర సమస్యలను కాలనీవాసులు కార్పొరేటర్ దష్టికి తీసుకు వచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డివిజన్ సమగ్రాభివద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఏ సమస్య ఉన్నా వెంటనే తన దష్టికి తీసుకు వచ్చినట్లయితే, సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వాటర్‌వర్క్స్ మేనేజర్ సతీష్, వర్క్ఇన్స్పెక్టర్ రమేష్, బీజేపీ నాయకులు సతీష్, శరత్ యాదవ్, జల్సారాజు, మహేందర్, రాము, స్థానిక కాలనీవాసులు శ్రీనివాస్, శర్మ, రెహమాన్, తదితరులు పాల్గొన్నారు.