Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
నవతెలంగాణ-మల్కాజిగిరి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదలకు అండగా నిలుస్తున్నాయని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. గురువారం మల్కాజిగిరి సర్కిల్ ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని చింతల బస్తీ, పీవీఎన్ కాలనీ, బీజేఆర్ నగర్ ఏరియాల్లో స్థానిక కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్తో కలిసి ఇంటింటికి వెళ్లి నలుగురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తుందని, పేద ప్రజలకు ఈ పథకం చాలా ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, మల్కాజిగిరి టీఆర్ఎస్ నాయకులు జీఎన్ వీ సతీష్ కుమార్, గుండా నిరంజన్, రాము యాదవ్, ఉపేందర్ రెడ్డి, బాబు, సత్యనారాయణ, సత్యమూర్తి, పీవీ సత్యనారాయణ, ఉపేందర్, నవీన్ యాదవ్, నరేష్ కుమార్, నహీం ఖాన్, సంతోష్ రాందాస్, గద్వాల జ్యోతి, సద్గుణ, పద్మ, కవిత, మాధవి, గీత గుప్తా తదితరులు పాల్గొన్నారు.