Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
కూకట్పల్లి నియోజకవర్గం దళిత ఐక్య వేదిక మహిళా అధ్యక్షురాలు ఎడ్ల కవిత ఆధ్వర్యంలో బాలానగర్ ప్రభుత్వ పాఠశాలలో సావిత్రిబాయి ఫూలే జయంతి వారోత్సవాల సందర్భంగా పలువురి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజాభివద్ధిలో మహిళలు అన్ని రంగాలలో చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని, సమాజం మార్పునకు కారణం స్త్రీలేనని, కుటుంబవ్యవస్థ, బడి, సమాజాభివద్ధి వంటివి మహిళలపై ముఖ్యంగా ఆధారపడి ఉంటాయన్నారు. మహిళలకు విద్యతోనే చైతన్యవంతులవుతారని, మహిళలు చట్టాలపై కూడా అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కాంత్ రెడ్డి, మహిళా ఉపాధ్యాయులు ఎం. ఝాన్సీ, రాజేశ్వరి, మోక్షద, మన సత్యం సత్యం సత్యం సత్యమ్మ, అనూష తదితరులు పాల్గొన్నారు.