Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దామరచర్ల
ప్రభుత్వం నిషేధించిన గుట్కా, పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 56 వేల విలువైన సరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ ఎస్ఐ వీరశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం దామరచర్లకు చెందిన కె.అశోక్, ఎస్.సత్యనారాయణ అనే వ్యక్తులు మిర్యాలగూడకు చెందిన బబ్లు అనే వ్యక్తి నుంచి పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేసి పరిసర గ్రామాల్లోని షాపుల్లో విక్రయిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిపై దాడి చేసి రూ.56 వేల విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులను పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.