Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
చేనేత రంగంపై ఉన్న ఐదు శాతం జీఎస్టీని పూర్తిగా ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చేనేత ఆత్మహత్యల కుటుంబాల బాధిత మహిళలు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే రైతులకు ఇచ్చిన మాదిరిగానే హ్యాండ్లూమ్, పవర్ లూమ్ కార్మికులకు కూడా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తానని హామీ ఇచ్చిన కేటీఆర్ ఇప్పటి వరకు దానిని నెరవేర్చకపోవడం విచారకరమని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 350 మంది చేనేతలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. వీరందరి కుటుంబాలను గుర్తించి హెల్త్‌కార్డ్‌లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, వితంతు పింఛన్, వారి పిల్లలకు ఉచిత విద్యా, వైద్యం ఏర్పాటు చేయాలని కోరారు. కోఆపరేటివ్ వ్యవస్థలో నిర్వీర్యం అవుతున్న చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించి నిధులు కేటాయించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ బోర్డ్‌ని తిరిగి ప్రారంభించాలని అన్నారు. చేనేత కళ వస్త్రాలను అంతర్జాతీయంగా ఎగుమతి చేసేందుకు తగిన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తిచేశారు.