Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
లోప్రెషర్ సమస్యలను అధిగమిస్తూ తాగునీటి సరఫరా సామర్థ్యాన్ని మెరుగుపరచాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. తాగునీటి వ్యవస్థ అభివృద్ధికి మంజూరైన రూ.114.27 కోట్ల నిధులతో చేపట్టనున్న రిజర్వాయర్లు, పైపులైన్ పనులపై పేట్‌బషీరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీల ప్రజా ప్రతినిధులు, వాటర్‌వర్క్స్, రెవెన్యూ, మున్సిపల్ విభాగాల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య తలెత్తకుండా పక్కా ప్రణాళికలతో రిజర్వాయర్లను వేగంగా చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అధికారులు సమన్వయంతో పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. నూతనంగా ఏర్పాటైన మూడు మున్సిపాలిటీలలో అన్ని బస్తీలు, కాలనీలలో మెరుగైన తాగునీటి సరఫరా అందించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలన్నారు. కార్యక్రమంలో నిజాంపేట మేయర్ కొలను నీలా గోపాల్‌రెడ్డి, కమిషనర్లు శంకరయ్య, రఘు, భోగిశ్వర్లు, ఆర్డీఓ మల్లయ్య, ప్రాజెక్టు సీజీఎం శ్రీధర్, జీఎంలు శ్రీధర్‌రెడ్డి, సంతోష్, డిప్యూటీ మేయర్ ధన్రాజు యాదవ్, చైర్మెన్ సన్న శ్రీశైలంయాదవ్, వైస్ చైర్మెన్లు తుడుమ్ పద్మారావు, గంగయ్య నాయక్, కౌన్సిలర్లు శంబీపూర్ కృష్ణ, జక్కుల కృష్ణయాదవ్, కార్పొరేటర్ కొలను వీరేందర్‌రెడ్డి, డీజీఎంలు శ్రీనివాస్, సరిత, నాయకులు దేవేందర్ యాదవ్, మురళీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.