Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
కోవిడ్ వ్యాప్తి చెందకుండా తగు చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. గురువారం కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో ఆయా సర్కిళ్ల ఉప కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో ఆస్తి పన్ను వసూళ్లు, కోవిడ్‌పై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాపార సంక్షేమ సంఘాలు, సంబంధితులతో సమావేశం నిర్వహించి ఆన్లైన్లో ట్రేడ్ లైసెన్స్‌లు, రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవడంపై అవగాహన కల్పించాలన్నారు. బిల్డింగ్ ఇంజినీర్లు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను తెలుసుకోవడానికి సర్కిళ్ల వారీగా బిల్డింగ్ ఇంజినీర్లు, ఆర్కి టెక్టులతో సమావేశం ఏర్పాటు చేసి ఆన్లైన్లో భవన నిర్మాణ అనుమతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వాటి దరఖాస్తులను అధికారులు నిర్ణీత సమయంలోనే క్లియర్ చేయాలన్నారు. లేకపోతే అధికారుల నుంచి పెనాల్టీ వసూలు చేయాలని ఉప కమిషనర్లకు ఆదేశించారు. సర్కిళ్ల వారీగా నిర్ణయించిన టార్గెట్ ప్రకారం ఆస్తిపన్ను వసూలు చేయాలన్నారు. ఈ ఏడాది ఈఓడీబీలో జీహెచ్ఎంసీకి మంచి ర్యాంకు వచ్చేలా సిటిజన్ ఫీడ్ బ్యాక్ ఉండాలని, అందుకు గాను ఉపకమిషనర్లు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీసీలు రవికుమార్, రవీందర్‌కుమార్, మంగతాయారు, ప్రశాంతి, నాగమణి, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.