Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
సీఎం రిలీఫ్ పండ్ పేదలకు వరం లాంటిదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గోధుమకుంట గ్రామానికి చెందిన నాచారం సందీప్ గౌడ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోవడంతో మంజూరైన రూ.60వేల చెక్కును సర్పంచ్ ఆకిటి మహేందర్ రెడ్డితో కలిసి అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సోమని ఆంజనేయులు, ఎంపీటీసీ మంచాల కిరణ్, జ్యోతి ప్రవీణ్ కుమార్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు చీర కృష్ణ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు చీర సురేష్ పాల్గొన్నారు.