Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. గురువారం బాగ్‌అంబర్‌పేట డివిజన్లోని వడ్డెర బస్తీలో రూ.22 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ పద్మావతి వెంకట్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారాన్ని అందించాలనే సంకల్పంతో నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతర బస్తీలో పాదయాత్ర నిర్వహించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొందరు ఒంటరి మహిళలు, వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు సరిగా అందడంలేదని దృష్టికి రాగా, వెంటనే సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బస్తీ వాసులు ఎం శివ, వి కుమార్, ఎస్ఎస్ గుప్తా, కిషోర్ కుమార్ లక్ష్మి, లక్ష్మమ్మ, యాదయ్య, నరసింహ, మల్లేశం, శివమూర్తి, శ్రీను, వెంకట్, ప్రసాద్, మురళీ, టీఆర్ఎస్ బాగ్అంబర్ పేట డివిజన్ ప్రెసిడెంట్ చంద్ర మోహన్, నాయకులు శ్రీరాములు, నర్సింగ్, యోబ్, మహేష్, శివాజీ యాదవ్, చంద్ర శేఖర్, శ్రీనివాస్ యాదవ్, సంతోష్, శ్రీను, అఫ్జల్ పటేల్, ఘని, రాజేష్, ఎంఎన్ఆర్, చుక్క జగన్, వెంకట్ రెడ్డి, కృష్ణగౌడ్, పోచయ్య, మిరియాల శ్రీనివాస్, వరలక్ష్మి, సుగుణ, సతీష్ గౌడ్, ముఖేష్ గౌడ్ పాల్గొన్నారు.