Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో శుక్రవారం సంక్రాంతి సంబురాలను ఘనంగా నిర్వహించారు. కళాశాల కార్యదర్శి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభి ంచారు. ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థులకు చెందిన కేమ్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులు కైట్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. రంగురంగుల పతంగులతో కళాశాల ప్రాంగణంలో పండుగ శోభ సంతరించుకుంది. రంగవల్లులు, సాంప్రదాయ దుస్తులు ధరించి విద్యార్థులు సంబురాల్లో ఉత్సా హంగా పాల్గొన్నారు. కళాశాల కార్యదర్శి రాజశేఖ ర్రెడ్డి విద్యార్థులతో కలిసి పతంగి (కైట్) ఎగరేసి విద్యార్థులను ఉత్సాహ పరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాలలో సాంకేతిక విద్యతోపాటు విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్ది వారిని గ్లోబల్ లీడర్లుగా తయారు చేస్తామన్నారు. చదువుతోపాటు క్రీడలు, క్రీడాకారులనూ ప్రోత్సహి స్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ కోశాధికారి మమతారెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, శ్రేయారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.