Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్ పేట
ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుంటానని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ శిరీష యాదవ్ అన్నారు. కాచిగూడ పరిధిలోని డ్రైనేజ్ పైప్లైన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సహకారంతో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాననీ, ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు ఎర్ర భీష్మ దేవ్, సీనియర్ నాయకులు డాక్టర్ ఓం ప్రకాష్ యాదవ్, సదనందు, తదితర నాయకులు పాల్గొన్నారు.