Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఆశా కార్యకర్తలు శుక్రవారం టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డిని కలసి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ 16 ఏండ్లుగా తమను ఏ ప్రభుత్వమూ గుర్తించలేదనీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రెండు సార్లు పారితోషకాలను పెంచినట్టు తెలిపారు. రూ.6 వేల నుంచి రూ.9,750 తీసుకొచ్చినందుకు సీఎం కేసీఆర్, ఈ ప్రయత్నంలో తమకు ఎంతో సహకరించిన రాజశేఖర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు రాములు, పద్మ, లావణ్య, మాధవి, మహాలక్ష్మి,పద్మ, రమణి, సంధ్య, రాధ, మమత, రజిని, పుష్ప, జ్యోతి పాల్గొన్నారు.