Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
15-18 ఏండ్ల వారు తప్పకుండా టీకా తీసుకోవాలని కార్పొరేటర్ రాజ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం వినాయకనగర్ డివిజన్లోని డీఏవీ స్కూల్, పాషా స్కూల్లలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కరోనాను ఎదుర్కోవడానికి ఎక్కడా లేని విధంగా మన దేశంలోనే పీఎం నమోడీ ఉచి తంగా దేశ ప్రజలందరికీ టీకా ఇస్తున్నారని తెలిపారు. దేశంలోని మారుమూల గ్రామాల్లో ఉండే చివరి వ్యక్తి వరకూ టీకా అందు తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివి జన్ అధ్యక్షులు ఓం ప్రకాష్, ప్రధాన కార్యదర్శి ఆర్.మణిరత్నం, భాస్కర్, సాయి సురేష్, ప్రియతం శ్రీనివాస్, రుత్విక్, రాంప్రసాద్, అజరు, మహేష్, కృష్ణ ప్రసాద్, విజరు భూపతి, సూర్యకాంత్ పాల్గొన్నారు.