Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఓ యువకుని చేయి చెక్క కోత మెషీన్లో పొరపాటున ఇరుక్కుపోయింది. చేతికి తీవ్రగాయాలు కావడంతోపాటు వేళ్లు తెగి పోయాయి. అతని ఎడమ చేయి మధ్య, ఉంగరం వేళ్లు కోతకు గురి కాగా, చూపుడు వేలు నలిగిపోయింది. ఈ సమ యంలోనే అతనికి తెలిసిన వ్యక్తులు కొందరు మెడికవర్ హాస్పిటల్స్‌లో డాక్టర్ ఆర్ సునీల్‌ను కలిస్తే ఫలితముంటుందని సూచించారు. దీంతో తక్షణమే అతన్ని కుటుంబ సభ్యులు హైటెక్ సిటీ వద్దనున్న మెడికవర్ హాస్పిటల్స్‌కు అతని చేతి నుంచి విడివడిన వేళ్లతోపాటు తీసుకువచ్చారు. అర్ధరాత్రి డాక్టర్ ఆర్. సునీల్ కన్సల్టెంట్ హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్, ఆర్థోపెడిక్ అండ్ ట్రౌమా సర్జన్ బృందం శస్త్రచికిత్స చేసింది. అతని మధ్య ఉంగరం వేళ్లను శస్త్రచికిత్స సమయంలో మైక్రోస్కోపిక్ ఖచ్చితత్త్వంతో తిరిగి అతికించారు. దాదా పు నాలుగున్నర గంటల పాటు ఈ శస్త్ర చికిత్స జరి గింది. తెగిపడిన వేళ్లకు రక్త సరఫరా పునరుద్ధరించ డంతోపాటు ఎముకలు అతికించిన తర్వాత నరాలు, కండరాలను కూడా సరిచేశారు. శస్త్రచికిత్స తర్వాత అతన్ని అతి సన్నిహితంగా పరిశీలించడంతోపాటు ఎలాంటి దుష్పలితాలూ లేవనుకుని నిర్థారించుకున్న తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేశారు. తెగి పడిన వేళ్లు, చేతిని అతికించడం అనేది అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స. దీనికి తగిన నైపుణ్యం కావాల్సి ఉంటుంది. యుక్త వయసు రోగులకు ఇది చక్కటి ప్రయోజనం కలిగించగలదు. డాక్టర్ ఆర్.సునీల్ మాట్లాడుతూ ''ఈ తెగిపడిన వేళ్లు పనికిరాని స్ధితిలో ఉన్నాయి కానీ అతి జాగ్రత్తగా, ఖచ్చితత్త్వంతో కూడిన శస్త్రచికిత్స చేయడం వల్ల వాటిని పునరుద్ధరించగలిగాం. ఈ రోగి పూర్తిగా కోలుకోవడంతోపాటు సంతృప్తి ఉండటం పట్ల మేము ఆనందంగా ఉన్నాం. చాలామందికి తెలియని అంశమే మిటంటే, తెగిపడిన వేళ్లను సైతం సమయానికి తీసుకువస్తే అతికించడం సాధ్యమే అని. సమయానికి తగిన చర్యలు తీసుకోవడం వల్ల వేళ్లు యధావిధిగా పని చేస్తున్నాయి'' అని తెలిపారు.