Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయాంజల్
సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు మూడేండ్లుగా అలుపెరుగని పోరాటం చేయడం ఫలితంగానే ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా సీడీఎంఏ సత్యనారాయణ యూనియన్‌తో చర్చించి అనంతరం 11వ పీఆర్సీ ప్రకారం 30శాతం వేతనాలను అమలు చేసే జీవో 4ను విడుదల చేశారని మున్సిపల్ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి డి.కిషన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో తుర్కయాంజల్ మున్సిపల్ కార్మికులు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా డి.కిషన్ మాట్లాడుతూ పోరాడితే పోయేదేమీ లేదు అనడానికి ఇదే నిదర్శనమన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ నెం 4 ప్రకారం 11వ పీఆర్సీ అమలైన 2021 జూన్ నెల నుంచే అమలు చేయాలనీ, అందుకు పెండింగ్ ఎరియర్స్ లెక్కగట్టి కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కమిషనర్ ఎం.ఎన్.ఆర్ జ్యోతి, మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రాంరెడ్డి, వైస్ చైర్ పర్సన్ గుండ్లపల్లి హరిత ధన్ రాజ్ మాట్లాడుతూ పెరిగిన వేతనాలపై హర్షం వ్యక్తం చేస్తూ మున్సిపల్ అభివృద్ధికి కార్మికులు మరింత కృషి చేయాలన్నారు. తమ మున్సిపల్ పరిధిలో ఉన్న కార్మికుల స్థానిక సమస్యలను వెంటనే పరిషరిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు టి. నర్సింహా, బి.శంకరయ్య, తుర్కయాంజల్ మున్సిపల్ కౌన్సిలర్లు వేముల స్వాతి అమరేందర్ రెడ్డి, కంబాలపల్లి ధన్‌రాజ్, కడారి శ్రీలత, బి.బాలరాజ్, రొక్కం అనిత చంద్రశేఖర్ రెడ్డి, మర్రి మాధవి మహేందర్ రెడ్డి, రేవెళ్లి హరిత యాదగిరి, మేతరి అనురాధ దర్శన్, గుండా భాగ్యమ్మ ధన్ రాజ్, పుల్లగుర్రం కీర్తన విజయానంద్ రెడ్డి, బొక్క శ్రీలత గౌతం రెడ్డి, బొక్క రవీందర్ రెడ్డి, కాకుమాను సునీల్, నారని కవిత శేఖర్ గౌడ్, కుంట ఉదయశ్రీ గోపాల్ రెడ్డి, కొత్తకర్మ మంగమ్మ, కొశిక ఐలయ్య, నాయకులు వంగేటి గోపాల్‌రెడ్డి, మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు మేతరి దాసు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.