Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలో గల జెడ్పీ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన డిస్కవరీ స్పోర్ట్స్ అకాడమీని ఎల్బీ నగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో కలిసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్లో మంచి ఆహ్లాదకరమైన ప్రాంగణంలో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులు శ్రీధర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు. యువత క్రీడల్లో రాణించాలి అంటే ఇలాంటి స్పోర్ట్స్ అకాడమీల వల్లనే సాధ్యమవుతుందన్నారు. నియోజ కవర్గం నుంచి అత్యున్నతమైన క్రీడాకారులుగా ఎదగాలని యువతకు సూచించారు. క్రికెట్ కామెంటరేటర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ అత్యాధునిక ప్రమాణాలతో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అకాడమీని స్థానిక ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హస్తినాపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు ఆంధ్ర సత్యం చారి, వర్కింగ్ ప్రెసిడెంట్ మై రెడ్డి ఉదరు కుమార్ రెడ్డి, బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, చప్పిడి సుధీర్ రెడ్డి, రాజిరెడ్డి, మీర్పేట సీఐ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.