Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ పరిధిలో గల సాగర్ కాంప్లెక్‌లో ఈ నెల 19-23 వరకు రేణుకా రాజరాజేశ్వరి పీఠం ఆధ్వర్యంలో మెళ్ళూరి నవీన్ శర్మ నిర్వహించ బోయే రుద్ర సహిత త్రిశత చండి మహా యాగానికి రావాల్సి ందిగా యాగ కమిటీ మెంబర్ నరేష్ యాదవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా, పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగా రెడ్డి, రూరల్ అధ్యక్షుడు బొక్క నర్సింహా రెడ్డి, రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడు భాను ప్రకాష్, కార్యదర్శి వెంకట్, సీనియర్ నాయ కులు సంగప్ప, జిల్లా రూరల్ అధ్యక్షుడు అర్జున్ రెడ్డి, మహేశ్వరం ఇన్చార్జి అందెల శ్రీరాములును మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన ప్రతులను అందజేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టా త్మకంగా చేపడుతున్న ఈ యాగానికి ప్రము ఖుల నుంచి విశేష స్పందన వస్తుందనీ, యాగానికి ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతు న్నాయనీ, కరోనా నిబంధనలకు అనుగు ణంగా యాగం లో వేలాదిగా భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీ సెల్ జాయింట్ కన్వీనర్ అమరేశ్, రాఘవ, వంశీ వున్నారు.