Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మెన్‌గా నియమితులై పదవీ బాధ్యతలు చేపట్టిన గజ్జల నగేష్ ను వారి కార్యాలయంలో మల్కాజిగిరి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం ముందుకు వెళ్లే ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రమే అన్నారు. సీఎం కేసీఆర్ వల్లనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. టీఆర్ఎస్ కోసం కష్టపడే ప్రతి ఒక్కరినీ సీఎం కేసీఆర్ ఆదరిస్తారనీ, ఈ మధ్యకాలంలో వివిధ కార్పొరేషన్లకు చైర్మెన్లుగా నియమించడం ద్వారా ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు పివి సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు, అనిల్ కిషోర్, బి.అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.