Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
రాష్ట్రంలో ఈఓడీబీ (ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్)లో భాగంగా విద్యుత్‌శాఖ అందిస్తున్న వివిధ సేవలు, మరింత మెరుగైన సేవలకు విద్యుత్‌శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై పారిశ్రామికవేత్తల, ఔత్సహిక పారిశ్రామిక వేత్తల నుంయి సలహాలు, సూచనలు పొందటానికి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయంలో విద్యుత్‌శాఖ ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి సునీల్ శర్మ, సంస్థ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జి.రఘుమారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఎస్ఎస్పీడీసీఎల్ విద్యుత్‌శాఖ ఆన్లైన్ ద్వారా అంది స్తున్న వివిధ సేవలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పారిశ్రామిక వేత్తలకు తెలియజేశారు. విద్యుత్ వినియోగదారులు సంస్థ వెబ్సైట్ www. tssouthernpower.com ద్వారా నూతన సర్వీసుల మంజూరు, దరఖాస్తుల పరిస్థితి, ఫిర్యా దుల ట్రాకింగ్, విద్యుత్ అంతరాయాల సమాచారం, బిల్లింగ్ సమాచారం వంటివి పొందగలరని సీఎండీ రఘుమా రెడ్డి తెలిపారు. విద్యుత్‌శాఖ పరంగా పారిశ్రామికవేత్తలు, ఔత్సహిక పారిశ్రామిక వేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలపాలని సునీల్ శర్మ కోరారు. దీనికి స్పందనగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి విద్యుత్ సరఫరా విషయంలో తమకు ఎలా తంటి సమస్యలు లేవని తెలిపారు. మరింత మెరుగైన, అనుకూల వాతావరణ కల్పన కోసం కొన్ని సలహాలు, సూచనలు చేశారు. వీరు చేసిన సలహాలు, సూచనలపై తగు చర్యలు తీసుకోవా ల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇతర సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకు రావాల్సిందిగా సునీల్ శర్మ తెలిపారు. ఈ సమా వేశంలో దాదాపు 70 మంది పారిశ్రామిక, ఔత్సహిక పారిశ్రామిక వేత్తలు, డైరెక్టర్లు టి. శ్రీనివాస్, కె.రాములు, పి.నరసింహరావు పాల్గొన్నారు.