Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కీసర గుట్టలో రెడ్డి సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి శుక్రవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి, జెడ్పీ చైర్మెన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమ భవనానికి కీసర గ్రామానికి చెందిన గుర్రం మల్లారెడ్డి తన స్వంత భూమి కేటాయించడం ఎంతో ఆదర్శనీయమ న్నారు. మేడ్చల్ జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన కీసర గుట్టకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత ఉందనీ, ఈ క్షేత్రానికి వచ్చే రెడ్డి కులస్తులదరికీ ఈ భవనం అందుబాటులో ఉండేలా అన్ని హంగులతో తీర్చిదిద్దాల న్నారు. మినీ కల్యాణ మండపం, భక్తులకు భోజన శాల, విడిది కోసం గదులు, పార్కింగ్ తదితర అంశాలను పరిగినలోకి తీసుకుని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలన్నారు. ప్రభుత్వం తరపున తన వంతు సహకారం, ఆర్థిక సాయం అందిస్తానని చెప్పారు. జెడ్పీ చైర్మెన్ శరత్ చంద్రా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి రెడ్డి బిడ్డ గర్వించేలా దాతలు భవన నిర్మాణానికి ముందుకు రావాలన్నారు. భూదాత మల్లారెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రశంసించారు. తన వంతు బాధ్యతగా నిర్మాణంలో సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. భూదాత మల్లారెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంక్షేమ సంఘం భవనం కోసం భూమిని ఇవ్వడం రెడ్డి కులస్తులు, ఆలయానికి వచ్చే రెడ్డి సోదరులకు ఉపయోగ పడాలన్నదే తన కోరిక అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి జేఏసీ చైర్మెన్ అప్పమ్మగారి రాంరెడ్డి, మేడ్చల్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, సర్పంచ్ మాధురి వెంకటేష్, పీఏసీఎస్ చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మెన్ బుచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ సత్తి రెడ్డి, ఎంపీటీసీ నారాయణ శర్మ, సింగిరెడ్డి సోమశేకర్ రెడ్డి, సింగిరెడ్డి ధన్ పాల్ రెడ్డి, నీలంరెడ్డి, కీసర ఉప సర్పంచ్ బాలమణి ప్రభాకర్ రెడ్డి, లక్ష్ష్మా రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కృష్ణా రెడ్డి, సుధాకర్ రెడ్డి, నాగారం మున్సిపల్ రెడ్డి సంఘం అధ్యక్షులు గోపాల్ రెడ్డి, అంజి రెడ్డి, సీతారాం రెడ్డి, కీసరగుట్ట రెడ్డి సంఘం అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు సంతోష్ రెడ్డి, కోశాధికారి ఎన్.కృష్ణారెడ్డి, భవన నిర్మాణ ప్రోగ్రాం ఆర్గనైజర్, అడ్వైజర్ విజరు కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.