Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
నేరెడ్మెట్ డివిజన్లో శుక్రవారం మల్కాజిగిరి సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నేరెడ్మెట్లో జరుగుతున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. త్వరలోనే బ్రిడ్జి ప్రజలకి అందుబాటులోకి రానుందని తెలిపారు. అనంతరం డిఫెన్స్ కాలనీలో ఉన్న డ్రయినేజీ సమస్యను సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈ మహేష్, ఏఈ సజన, వర్క్ ఇన్స్పెక్టర్ శివ, సుదేష్, డ్రయినేజీ సిబ్బంది పాల్గొన్నారు.