Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
పండుగలు భారతీయ సంస్కృతి, సంప్రదా యాలకు ప్రతీక అని ముషీరాబాద్ డివిజన్ కార్పొరేటర్ మాచినపల్లి సుప్రియ నవీన్‌గౌడ్ పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు పూర్తి చేసుకున్న సంద ర్భంగా శనివారం ముషీరాబాద్ డివిజన్లో కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత మహౌత్సవ కార్యక్ర మంలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు అన్నారు. అనంతరం ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముషీరాబాద్ అసెంబ్లీ కో కన్వీనర్ నవీన్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు బద్రి నారాయణ, మహిళా మోర్చా కన్వీనర్ కల్పన, అధ్యక్షులు రేవతి, ప్రధాన కార్యదర్శి పద్మ, దిశ సభ్యురాలు మంగళ, జయశ్రీ, రాధిక, సౌజన్య, అపర్ణ, తదితరులు పాల్గొన్నారు.