Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాప్రా సర్కిల్ డాక్టర్ ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ పరిధిలోని ఒమేగా జూనియర్, డిగ్రీ కళాశాలలో శనివారం విద్యార్థులకు వ్యాక్సినేషన్ కార్యక్ర మాన్ని స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, ఉప్పల్ నియోజక వర్గ బీ బ్లాక్ కాప్రా సర్కిల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. జమ్మిగడ్డలోనే కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సంపత్ పర్యవేక్షణలో 400 మంది విద్యార్థినీ విద్యార్థులకు వ్యాక్సినేషన్ చేశారు. వ్యాక్సినేషన్ చేసుకున్న పిల్లలను డాక్టర్లు పర్యవేక్షణలో విశ్రాంతి గదిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. కళాశాలలో వ్యాక్సినేషన్ ఏర్పాట్లను కార్పొరేటర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కుషా యిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది డాక్టర్ సాగరిక, అనురాధ, హెల్త్ అసిస్టెంట్లు విజయ, రాణి, రాధిక, ఓమెగా కళాశాల సెక్రెటరీ, కరస్పాండెంట్ సీతారాంరెడ్డి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రాజ్ నారాయణరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ శివ భవాని, కాలేజ్ ఉపాధ్యాయులు వాసుదేవ్, గంగాధర్, యాదగిరి, బేబ్రోహ, మంజుల, పరమేశ్వరి, శైలజ, ప్రణీత పాల్గొన్నారు. నవతెలంగాణ-కాప్రా