Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్ మెట్
గాంధీనగర్ డివిజన్, శాంతి యువజన సంఘం బస్తీలో నిరుపయోగంగా వున్న ఖాళీ స్థలంలో నూత నంగా బస్తీ కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇవ్వాలని బస్తీ నాయకులు గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినరు కుమార్‌కు తన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం బస్తీ నాయకులతో మాట్లా డుతూ త్వరలోనే ప్రజలకు అందుబాటులో వుండే విధం గా కమ్యూనిటీ హాల్‌ను నిర్మించి, అందరి సౌకర్యార్థం బస్తీ దవాఖానా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని కార్పొరేటర్ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర నాయకులు వినరు కుమార్, నాయకులు ముత్యా లు, బీజేవైఎం నాయకులు తరుణ్ కుమార్, బస్తీ నాయ కులు,పెంటయ్య, సుంక రాజు, వేణు యాదవ్, దయా, మూసా అహ్మద్, ఈద సాయి, హరినాథ్ పాల్గొన్నారు.