Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
డివిజన్‌ను అగ్రగామిగా ఉంచడమే ప్రధాన లక్ష్యమనీ, ఇందుకు ప్రజలు సహకరించాలని మల్కా జిగిరి ఎమ్యెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. శనివారం అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ కౌకూర్ దర్గా దగ్గరలోని సామల లక్ష్మీనగర్‌లో రూ.77 లక్షలతో అభివృద్ధి పనులకు స్థానిక డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్‌తో కలిసి శంకుస్థా పన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మచ్చబొల్లారం డివిజన్‌ను అగ్రగామిగా ఉంచుతామ న్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ రాజు, డీఈ మహేష్, ఏఈ రవళి, వాటర్ బోర్డు మేనేజర్ మల్లికా ర్జున్, టీఆర్ఎస్ లీడర్స్ సురేందర్ రెడ్డి, శ్రీశైలం, మల్లేష్, మల్లికార్జున్, లక్ష్మణ్ యాదవ్, వెంకటేష్ యాదవ్, రాజేష్, బాబు, రమేష్ యాదవ్, రాజు యాదవ్, సతీష్, నిరంజన్, సంజీవ, సందీప్, కవిత, తదితరులు పాల్గొన్నారు.