Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కౌన్సిలర్ కె.లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-బడంగ్పేట్
జల్పల్లి మున్సిపల్ పరిధిలోని శ్రీరాం కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి తన వంతు కషి చేస్తానని 18వ వార్డు కౌన్సిలర్ కే.లక్ష్మీనా రాయణ అన్నారు. శనివారం గత ఆరు రోజులుగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వార్డు బాట కార్యక్రమంలో భాగంగా కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కారం కోసం ఎంతో కషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అదేశంతో ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. కాలనీలో నెలకొని ఉన్న ప్రజా సమస్యలను నేరుగా తన దష్టికి తీసుకురావాలని కాలనీవాసులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మీడియా సెల్ కన్వీనర్, మాజీ ఆర్మీమెన్ కె.వాసుబాబు, మున్సిపల్ ఎన్విరాన్మెంట్ ఇన్ఛార్జి శ్రీనివాస్, శానిటేషన్ సూపర్వైజర్ కుమార్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.