Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసోద్దిన్
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
ప్రజలకు మౌలిక సదుపా యాలు కల్పించేలా కృషి చేస్తానని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసోద్దిన్ అన్నారు. శని వారం డివిజన్ పరిధిలోని న్యూ అల్లాపూర్‌లో రూ.8లక్షలతో చేపడుతున్న నూతన తాగునీటి పైపులైన్ పనులను ఆమెతో పాటు మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌసోద్దిన్, జలమండలి జీఎం శ్రీనివాస్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో డివిజన్ అభివృద్ధి జరుగుతోందన్నారు. పనుల్లో జాప్యం చేయవద్దని, త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు వినరు, డివిజన్ కోఆర్డినేటర్ వీరారెడ్డి, సయ్యద్ నజీర్, నాయకులు ఇస్మాయిల్, మహమ్మద్, నూరుఖాన్, చాంద్, కరీం, మోయిన్, జావిదుద్దీన్, కమల్, యోగి, ఖదీర్, రఫీయా, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.