Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉపసర్పంచ్ బసత్తు కృష్ణగౌడ్
నవతెలంగాణ-ఘట్కేసర్
తప్పుుడు అరోపణలతో తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తు నాపై అవిశ్వాస తీర్మానం పెడుతున్న అంకుషాపూర్ సర్పంచ్ కొమ్మిడి జలజా సత్యనా రాయణరెడ్డికి తగదని ఉపసర్పంచ్ బత్తుల కృష్ణగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంకుషాపూర్ సర్పంచ్ కొమ్మిడి జలజా సత్యనారాయణరెడ్డి గ్రామ అభివృద్ధికి తోడ్పడకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, తనపై లేనిపోని ఆరోపణలు చేస్తు అవిశ్వాస తీర్మానం పెట్టడం ఎంత వరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఉపసర్పంచ్గా ఎలాంటి తప్పులు చేయలేదని తెలిపారు. గ్రామ అభివృద్ధికే నావంతు తగిన కృషిని అందిస్తున్నానని తెలిపారు. పర్యవేక్షణకు మండల అధికారులు వచ్చినప్పుడు మహిళా వార్డు సభ్యులపై హేళన చేస్తు మాట్లాడుతున్నట్లు సర్పంచ్ చేసిన ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. గ్రామ అభివృద్ధికి తోడ్పడవలసిన సర్పంచ్ కొమ్మిడి జలజా సత్యనారాయణ రెడ్డి గ్రామంలో ఎన్నో అక్రమాలు. భూకబ్జాలు చేస్తు గ్రామ పంచాయితీకి కోట్లల్లో నష్టం తెస్తున్నారని ఆయన ఆరోపించారు. నాపై కాంట్రక్టర్లను ఇబ్బందులకు గురిస్తున్నట్లు చేసిన ఆరోపణలో ఎలాంటి నిజాలు లేవని, ఇప్పటి వరకు ఏ కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేయలేదని, అలా నిరూపిస్తే రాజీనామాకు కూడా సిద్ధమని ఆయన అన్నారు. ఇంకుడు గుంతల విషయంలో నాకు రావలసిన నాలుగు లక్షల రూపాయలు సర్పంచ్ చెల్లిస్తానని తెలిపి ఇప్పటి వరకు చెల్లించలేదని, గత కలెక్టర్ యం.వి.రెడ్డి ఇంకుడు గుంతల తీయకుంటే సస్పెండ్ చేస్తానని హెచ్చరించడంతో గ్రామ పంచాయతీలో చేర్చించగా ఎవ్వరు ముందుకు రాకపోవడంతో తాను ముందుకు వచ్చానని, అందుకు సర్పంచ్ డబ్బులు ఇస్తానని చెప్పి ఇంకుడు గుంతలు తీయమని రూ.25 వేలు ఇచ్చారని, ఇంకా రూ.3లక్షల 75 వేలు సర్పంచ్ చెల్లిస్తానని తెలిపి ఇప్పటి వరకు నాకు రావలసిన డబ్బులు ఇవ్వలేదని, మిగత డబ్బులు చెల్లించి న్యాయం చేయాలని ఆయన కోరారు