Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ సెట్, టీఎస్ పీజీ లాసెట్ కన్వీనర్ ఎంపికలో ఎస్సీ, ఎస్టీ ప్రొఫెసర్స్‌కు తీరని అన్యాయం చేశారని ఓయూ లా విభాగం డీన్ ప్రొఫెసర్ గాలి. వినోద్ కుమార్ ఆరోపించారు. దీనిపై త్వరలోనే రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. అర్హతలున్నప్పటికీ లాసెట్ కన్వీనర్ నియమించకుండా వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా కన్వీనర్ పనిచేసిన అగ్రవర్ణ ప్రొపేసర్ నాలుగోసారి అవకాశం ఇవ్వడం ఎంత వరకు సమంజసం కాదన్నారు. శనివారం ఓయూ ప్రొపెసర్స్ క్వార్టర్లోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ మాట్లాడుతూ. ఎస్సీ, ఎస్టీ ప్రొఫెసర్లకు సంవత్సరం కూడా లా సెట్ కన్వీనర్ నియమించపోవడం పై మండిపడ్డారు. లా విభాగం డీన్‌గా వ్యవహరిస్తున్న తనకు ఈ ఏడాది కన్వీనర్‌గా ఎంపిక చేయలేదని దుయ్యబట్టారు. గతేడాది సైతం లా కళాశాల ప్రిన్సిపల్‌గా, లా విభాగం డీన్‌గా వ్యవహరించిన సీనియర్ ప్రొఫెసర్ పంతు నాయక్ కూడా అర్హతలు ఉన్న కన్వీనర్ ఎంపిక చేయలేదని గుర్తు చేశారు. వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఓయూకు ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ ప్రొఫెసర్లను వీసీగా నియమించలేదని చెప్పారు. అన్ని అర్హతలు ఉన్న ఉన్న దళిత ప్రొఫెసర్స్ ఓయూకు వీసీగా పనిచేసేందుకు అర్హత ఉండదా అని గాలి ప్రశ్నించారు. ఇప్పటికైనా లాసెట్ కన్వీనర్ ఎంపికను పునః పరిశీలించాలని కోరారు. లేనిపక్షంలో తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. ఓయూలో దళితులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.