Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాల్‌సెంటర్‌పై దాడులు
8 మందిని అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఉద్యోగాలపేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న కాల్‌సెంటర్‌పై సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఢిల్లీకి వెళ్లి అక్కడున్న నిందితులు 8 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 26 సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌తో కలిసి జాయింట్ సీపీ గజారావు భూపాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీకి చెందిన రాజేష్ సింగ్, అనుభవ్‌సింగ్, నఫీజ్, సైఫ్ అలీ, యోగిత, షాలు కుమారి, ప్రియ, శివానీలు ఒక మఠాగా ఏర్పాడ్డారు. మయూర్ విహార్ పేరుతో ఢిల్లీలో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 'షైన్.కామ్'తో పాటు ఇతర (ఉద్యోగాల) వెబ్సైట్లలో రిజిస్ట్రర్ అవుతున్నారు. ఉద్యోగాల కోసం వివిధ వెబ్సైట్లలో ధరఖాస్తు చేసుకునే వారి వివరాలను సేకరిస్తున్నారు. ఆ తర్వాత టార్గెట్ చేసుకున్న వారికి కాల్ సెంటర్‌నుంచి ఫోన్ చేస్తున్నారు. వెబ్సైట్ ఉద్యోగిగా పరిచయం చేసుకుని, ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇతరత్రా పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా హైదర్‌గూడకు చెందిన ఓ యువతి ఎయిర్ హోస్టర్ జాబ్ కోసం వెబ్సైట్లో రెజ్యూమ్ పెట్టింది. దాని ఆధారంగా ఆమెను సంప్రదించిన ముఠా ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించింది. సెక్యురిటీ డిపాజిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌తోపాటు వివిధ చార్జీల పేరుతో అందినకాడికి దండుకున్నది. సదరు ముఠా రెండేండ్లలో రూ.8,02,426 వరకు వసూలు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన సీసీఎస్ పోలీసులు ఢిల్లీకి చేరుకుని మోసానికి పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశారు.
గిఫ్టుల పేరుతో కూడా...ఫ్రెండ్షిప్కు గుర్తుగా ఖరీదైన గిఫ్టులు పంపిస్తామని మోసానికి పాల్పడే నైజీరియన్లకు సహకరిస్తున్న ఇద్దరు నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ కేవీఎం ప్రసాద్‌తో కలిసి జాయింట్ సీపీ గజారావు భూపాల్ వివరాలు వెల్లడించారు. యూపీకి చెందిన మహ్మద్ నయీం, ఎండీ ఫారూక్‌లు ఫ్రెండ్స్. వీరు నైజీరియన్లతో చేతులు కలిపి తెలిసిన వారి బ్యాంక్ అకౌంట్లను వారికి అందిస్తున్నారు. నైజీరియన్లు వాట్సాప్ గ్రూపుల్లో అమాయకులను పరిచయం చేసుకుని, కొన్ని రోజులు చాటింగ్ చేస్తున్నారు. కొందరు ఫ్రెండ్షిప్ పేరుతో దగ్గరవుతున్నారు. మరికొందరు పెళ్లిళ్ల పేరుతో చనువు పెంచుకుంటున్నారు. ఆ తర్వాత ఇండియాకు వస్తున్నామని, స్నేహానికి గుర్తుగా ఖరీదైన గిఫ్టులు తీసుకొస్తామని నమ్మిస్తున్నారు. ప్లాన్‌లో భాగంగా రెండు రోజుల తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులుగా బాధితులతో పరిచయం చేసుకుని మీకు ఖరీదైన గిఫ్ట్, డాలర్లు, ఇతర వస్తువులు వచ్చాయని, వాటికి కస్టమ్స్ సుంకం కట్టాలని డబ్బులను ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. ఈ విధంగా బేగంపేట్‌కు చెందిన ఓ వ్యక్తి ద్వారా రూ.9,19,400 వసూలు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసునమోదు చేశారు. ఏసీపీ ప్రసాద్ ఆదేశాలతో ఇన్స్పెక్టర్ జి.వెంకటరామ్‌రెడ్డి, ఎస్ఐ కె.మధుసూదన్ రావులు దర్యాప్తు చేస్తున్నారు. నైజీరియన్లకు కమీషన్లపై బ్యాంక్ అకౌంట్లు అందించిన నయీం, ఫారూక్‌లను అరెస్టు చేశారు. ఆన్న్లో ప్రకటనలు చూసి మోసపోవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.