Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు
నవతెలంగాణ- సుల్తాన్‌బజార్
తెలంగాణ వైతాళికుల్లో ఒకరైన గడియారం రామకష్ణశర్మ తనకు స్ఫూర్తి ప్రదాత అని ప్రముఖ సాహితీవేత్త గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్‌లో జరుగుతున్న పరిణత వాణి ప్రసంగ లహరి 6వ రోజు శనివారం ఆయన 87వ ప్రసంగం చేశారు. జన్మస్థలం అలంపూర్‌లో గడి యారం రామకష్ణశర్మ జోగులాంబ దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బాల బ్రహ్మేశ్వర సంస్కత పాఠశాలలో అయిదారేళ్ల వయసులోనే పాణిని అష్టాధ్యాయి, దాదాపు పంచకావ్యాల అధ్యయనం పూర్తి చేశానని, సంస్కతంలోనే సంభాషించే ప్రావీణ్యం సముపార్జించానని చెప్పారు. తర్వాత పాలెం ప్రాచ్య కళాశాలలో పూర్తిగా తెలుగు సాహిత్య అధ్యయనంలో మునిగితేలానని, అక్కడ గురువు డాక్టర్ శ్రీ రంగాచార్య వ్యక్తిగత గ్రంథాలయంలోని పుస్తకాలన్నీ చదివి జీర్ణం చేసుకున్నానని తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు భాషాసాహిత్యాల్లో స్నాతకోత్తర స్థాయిలో డాక్టర్ సినారె, బి.రామరాజు వంటి గురువులు లభించారని, తన అక్షర యానానికి మరింత విస్తతి ఏర్పడిందని చెప్పారు. సత్తుపల్లి జలగం వెంగళరావు డిగ్రీ కళాశాలలో అధ్యాప కునిగా తొలి ఉద్యోగం వచ్చిందని, అక్కడి విద్యార్థులతో మమేకమయ్యానని, అక్కడ తన పాఠాలు విన్న విద్యార్థుల్లో డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్ ఒకరని గిరిజా మనోహర్ బాబు వివరించారు. కవిత్వం ప్రాచీనం, ఆధునికం అని వేరువేరుగా ఉండదని, కాలాన్ని అనుసరించి రూపం మారవచ్చుగాని కవిత్వం ఒకటేనని తెలిపారు. తనకు మొదటి నుంచి నాటకం అన్నా కూడా ఇష్టమని, విద్యార్థి దశ నుంచి నాటకాలు వేయటం, ఏకపాత్రాభినయం ప్రదర్శిం చడం, విద్యార్థులతో నాటకాలు వేయించడం కొనసాగిం చానని, తర్వాత సాహితీ రూపకాల్లో ప్రధాన పాత్రలు ధరిం చానని, గిరిజా మనోహర్‌బాబు తెలిపారు. పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ చిన్న వయసులోనే గడియారం రామకష్ణ శర్మకు అత్యంత సన్నిహితుడైన గిరిజా మనోహర్‌బాబు ప్రతిభావంతునిగా ఎదిగారని అన్నారు. వరంగల్‌లో సహదయ సంస్థను నెలకొల్పి 25 సంవత్సరాలుగా తెలుగు సాహిత్యానికి ముఖ్యంగా నాటక కళకు పట్టుదలతో, సంకల్పంతో సేవ చేస్తున్నారని అన్నారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య స్వాగతోపన్యాసం చేస్తూ పరిణత వాణి ప్రసంగాలతో కూడిన 9వ సంపుటి త్వరలో ప్రచురిస్తామని తెలిపారు. ఆదివారం ఉదయం 11గంటలకు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్‌రావు ప్రసంగం ఉంటుందని చెప్పారు. సురవరం ప్రతాపరెడ్డి కుమారుడు డా.కష్ణవర్ధన్, డా.సి.వసుంధర పాల్గొన్నారు.