Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
సూర్యాపేట జిల్లా పెంచికలిదిన్నె గ్రామానికి చెందిన (దళిత బిడ్డ ) నందిపాటి వసంతకు ఓయూ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఇటీవలే ఓయూ పరీక్షల విభాగం ఒక ప్రకటన విడుదల చేశారు. ఓయూ ఎన్విరాన్మెంటల్ సైన్స్ (పర్యావరణ శాస్త్రం) విభాగంలో ప్రొఫెసర్ సి.వెంకటేశ్వర్ పర్యవేక క్షణలో ''ది ఎఫెక్ట్ అఫ్ ట్రీటెడ్ అటెడ్ హుసేన్సాగర్ వాటర్ అండ్ బోర్ వాటర్ ఆన్ లెబియో రోహిత'' అనే అంశంపై పరిశోధన పూర్తిచేసి గ్రంథాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వసంతకు ఓయూలోని పలువురు అధ్యాపకులు, పరిశోధనా విద్యార్థులు అభినందనలు తెలిపారు. వసంత మాట్లాడుతూ పరిశోధనలో తనకు సహకరించిన అధ్యాపకులుతో పాటు పలువురు పరిశోధనా విద్యార్థులకు ఆమె ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. వసంత విద్యాభ్యాసం ఒకటి నుండి పది వరకు పెంచికలిదిన్నె గ్రామంలో, ఇంటర్, డిగ్రీ మిర్యాలగూడలో, హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంపస్లో ఎమ్మెసీ ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్విరాన్మెంటల్ సైన్స్ విభాగంలో పీహెచ్డి పూర్తి చేసింది. ఓయూలో పీహెచ్డీ పూర్తి చేసినందుకుగాను తన స్నేహితులతో పాటు గ్రామ ప్రజలు ఆమెకు అభినందనలు తెలిపారు.