Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
బాస్ సేవలను నిజామాబాద్‌లో మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గం ప్రతినిధులు అన్నారు. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటైన సందర్భంగా ఉస్మాన్‌గంజ్‌లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి కేంద్ర కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, జాయింట్ సెక్రెటరీగా యాంస్వామి, రవీందర్ గుప్తా, ప్రకాష్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా గజవాడ ఆగమయ్య, లాబిశెట్టి శ్రీనివాస్, మంచాల జ్ఞానేందర్, ఎల్లంకి సురేందర్‌లు ఎన్నికైనట్టు సమితి అధ్యక్షులు క్యాథం రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మెడిశెట్టి రాకేశ్, కోశాధికారి సి.ఎ.అనిల్ కుమార్‌లు నూతన వర్గానికి నియమాక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ప్రతినిధి బృందంతో కలిసి మాట్లాడుతూ బాస్ సేవలను నిజామాబాద్‌లో మరింత విస్తరిస్తామ న్నారు. సంస్థ అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ పదవులు తమకు మరింత బాధ్యతను పెంచాయన్నారు. ఇప్పటికే బాస్ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయని తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రధాన కమిటీ సభ్యులు సత్కరించారు.