Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
సంక్రాంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ మూడో వార్డులోని పీఎన్టీ కాలనీలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత హనుమాన్ చౌదరి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ముఖ్య అతిథులు హాజరై మాట్లాడారు. తెలుగు సంస్కతి సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రత్యేకత అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షురాలు నీరజ, వెంకట్ పాల్గొన్నారు.