Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ వెస్ట్ కృష్ణానగర్ కాలనీలో విజయ డయాగస్టిక్, బ్రాహ్మణ సేవా సమాఖ్య ఉమ్మడి ఆధ్వర్యంలో ఆదివారం హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ పాల్గొని మాట్లాడుతూ కాలనీ వాసులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా హెల్త్ క్యాంప్ నిర్వహించిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సమాఖ్య నాయకులు వెంకటేష్, వర్ధని, విజయ డయాగస్టిక్ ప్రతినిధులు, కాలనీ అధ్యక్షులు రామకృష్ణ, స్థానిక కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.