Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం అని పోచారం మున్సిపాలిటీ మూడో వార్డు కౌన్సిలర్ చింతల రాజశేఖర్ అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ ఎల్ఐజీ కాలనీలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఇంటి పరిసరాలు, వీధులను శుభ్రపరచుకోవాలని రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రం చేపడుతు న్నామన్నారు. ప్రజల్లో శుభ్రత పరిశుభ్రతపై అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఎవరూ చెత్తను బయట వేయకూడదని కాలనీవాసులకు సూచించారు. కరోనా మహమ్మారి ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించాలనీ, శానిటైజర్‌ను దగ్గర ఉంచుకోవాలని తెలిపారు. ఇకపైన ఎవరైనా చెత్తను బయట వేస్తే తగిన జరిమానా తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ రఘు, కాలనీ మాజీ ప్రెసిడెంట్ అర్జున్ యాదవ్, బ్లాక్ ఇన్చార్జి మౌనిక, జేబిన సుల్తానా, యాదగిరి, పద్మ, నిరంజన్, తిరుపతి, నజీర్, అంజయ్య, సంతోష్, హేమంత్, వీరేష్, సీతమ్మ, తదితరులు పాల్గొన్నారు.