Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
చిలకానగర్ డివిజన్లోని మడేల్లయ రజక వృత్తిదారుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ఆదివారం వార్డు కార్యాలయంలో ఆవిష్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రజకుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం రజక వృత్తిదారులకు ఉచిత కరెంటును అందజేస్తు న్నామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే బంగారు తెలంగాణ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, మడేల్లయ రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షులు మామి డల మల్లేష్, ప్రధాన కార్యదర్శి కొల్లూరి సాంబరాజు, తదితరులు పాల్గొన్నారు.