Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నట్టు ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ కార్పొరేటర్ వై.ప్రేమ్ కుమార్ అన్నారు. ఆదివారం ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ పరిధిలోని తిరుమలనగర్‌లో కొంతకాలంగా పాడైపోయిన బోరుకు మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లో నెలకొన్న డ్రయినేజీ, రోడ్లు, స్ట్రీట్ లైట్స్ తదితర సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కాలనీవాసులకు సూచించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు నర్సింగ్‌రావు, వెంకటేశ్వర్లు, రాబర్ట్, ఉమా, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.